'ssmb 28' కంటే వెకేషన్స్ కే డేట్స్ ఎక్కువ ఇచ్చిన మహేష్!
on Nov 10, 2022

'సర్కారు వారి పాట' చిత్రంతో మహేష్ బాబు ప్రేక్షకులను పలకరించి ఆరు నెలలైంది. ఆ తర్వాత తన 28వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రకటించాడు. ఈ చిత్రం ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది. కానీ రెండో షెడ్యూల్ కి మాత్రం మోక్షం కలగట్లేదు. స్క్రిప్ట్ విషయంలో మహేష్ సంతృప్తిగా లేడని, ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్టేనని కూడా వార్తలు వినిపించాయి. అయితే మేకర్స్ మాత్రం త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలవుతుందని చెబుతున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే అలా లేదు. ఈ ఏడాది మహేష్ ఈ సినిమా కంటే వెకేషన్స్ కే ఎక్కువ డేట్స్ ఇచ్చినట్టు అనిపిస్తోంది.
త్రివిక్రమ్ తో సినిమా తర్వాత మహేష్ తన 29వ సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు. త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యి రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి సినిమాతో తమ హీరోకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని వారి ఆశ. కానీ మహేష్ మాత్రం 'ssmb 28'ని ఆలస్యం చేస్తూ వారిని నిరాశపరుస్తున్నాడు.
మహేష్ ఈ ఏడాది ఫ్యామిలీతో వరుస వెకేషన్స్ కి వెళ్తున్నాడు. యూరప్, యూకే ఇలా అన్ని కవర్ చేస్తున్నాడు. ఇటీవలే లండన్ నుండి తిరిగివచ్చిన మహేష్ ఇక 'ssmb 28' సెకండ్ షెడ్యూల్ మొదలు పెడతాడు అనుకుంటే.. ఇప్పుడు మరో ట్రిప్ కి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి వెళ్ళబోతున్నట్టు సమాచారం. ఈ లెక్కన 'ssmb 28' సెకండ్ షెడ్యూల్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు.
మహేష్ సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టకుండా వరుస వెకేషన్స్ కి వెళ్లడం చూస్తుంటే.. నిజంగానే స్క్రిప్ట్ విషయంలో మహేష్ సంతృప్తిగా లేడనిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ కి మెరుగులుదిద్దే పనిలో ఉన్నారో లేక అసలు ఈ ప్రాజెక్ట్ ఆలస్యానికి మరేదైనా కారణముందో తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



