'ధూమ్ ధామ్ దోస్తాన్' సాంగ్.. నాని లుక్స్ అన్‌బిలీవబుల్!
on Oct 1, 2022

నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'దసరా'. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో కీర్తి సురేశ్ హీరోయిన్. ఇందులో "ధూమ్ ధామ్ దోస్తాన్" అనే లోకల్ స్ట్రీట్ సాంగ్ ఈనెల 3న విడుదల కానున్నది. సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ఈ పాటలో బొగ్గు గనుల్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి మాస్ స్టెప్పులతో అలరించినున్నాడు నాని. ఈ పాటకు సంబంధించిన విడుదల చేసిన పోస్టర్‌లో ఊహాతీతంగా 'రా అండ్ రస్టిక్' ఊర మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు అతను కనిపిస్తున్నాడు.
గుబురు గడ్డం, ఉంగరాలు తిరిగి పెరిగిపోయిన జుట్టు, ఒళ్లంతా బొగ్గుమసితో లుంగీ, లోపల బనియన్, ఓపెన్ షర్టుతో ఇంతదాకా ఎప్పుడూ చూడని రూపంలో అదరగొడ్తున్నాడు. కళ్లు తేజోవంతంగా మెరిసిపోతున్నాయి.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో సముద్రకని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రధారులు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2023 మార్చి 30న దసరా విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



