సమంత... నాగచైతన్య... న్యూఇయర్ పార్టీ అక్కడే!
on Dec 27, 2019

ఏడాది చివరికి వచ్చేసింది. మరో వంద గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాం. 2019కి ఎలా వీడ్కోలు పలకాలి? 2020కి ఎలా స్వాగతం పలకాలి? న్యూ ఇయర్ పార్టీ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? అని ఎవరి ప్లాన్స్ వారు వేసుకుంటున్నారు. ఇందుకు, సినిమా స్టార్స్ కూడా అతీతం ఏమీ కాదు. ఆల్రెడీ కొందరు న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం తమకు ఇష్టమైన నగరాలకు చెక్కేశారు. అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులకు ఇష్టమైన సిటీ గోవా. వీళ్ళిద్దరూ గోవాలో 2020కి వెల్కమ్ చెబుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆల్రెడీ సమంత గోవా వెళ్లారు. నాగచైతన్య కూడా రేపోమాపో వెళతాడట.
'మజిలీ'తో నాగచైతన్య, సమంత ఈ ఏడాది మధురమైన విజయాన్ని అందుకున్నారు. 'ఓ బేబీ'తో సోలోగా సమంత సక్సెస్ అందుకుంది. కుమారుడు వెంకటేష్, మనవడు నాగచైతన్యతో కలిసి సినిమా నిర్మించాలనేది మూవీ మొఘల్ రామానాయుడు కోరిక. ఆయన ఈలోకంలో లేకున్నా... ఈ ఏడాది ఆ కోరిక తీరింది. మావయ్య వెంకీతో కలిసి నాగచైతన్య 'వెంకీమామ' సినిమా చేశాడు. 2019లో చైతన్య, సమంతకు మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఈ ఏడాదికి గ్రాండ్ గా టాటా చెబుతూ, కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పాలని డిసైడ్ అయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



