నాగ చైతన్య 'కస్టడీ' రిలీజ్ డేట్ వచ్చేసింది!
on Dec 28, 2022

నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కస్టడీ'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
నాగ చైతన్య పుట్టినరోజు కానుకగా నవంబర్ లో విడుదలైన 'కస్టడీ' మూవీ ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒంటి మీద గాయాలతో పోలీసు దుస్తులు ధరించి ఉన్న చైతన్యను అనేకమంది పోలీసులు కలిసి బందిస్తున్నట్లుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంది. తమిళ్ లో 'మానాడు' వంటి బ్లాక్ బస్టర్ అందించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అక్కినేని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. 2023, మే 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



