పాన్ ఇండియా రేంజ్ లో 'గూఢచారి-2'.. రేపే అనౌన్స్ మెంట్!
on Dec 28, 2022

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది 'మేజర్', 'హిట్-2' చిత్రాలతో ఘన విజయాలు అందుకున్న శేష్.. వచ్చే ఏడాది కూడా అదే జోరు చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ రేపు(గురువారం) రాబోతోంది.
శేష్ నటించిన 'గూఢచారి' మూవీ 2018లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తానని శేష్ ఎప్పుడో ప్రకటించాడు. అయితే ఈ సీక్వెల్ ని పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రేపే రాబోతోంది. తాజాగా శేష్ తన కొత్త సినిమాకి సంబంధించిన సర్ ప్రైజ్ న్యూస్ రేపు రాబోతుందని ట్వీట్ చేశాడు.
'గూఢచారి-2'ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించనుందని సమాచారం. రేపు మధ్యాహ్నం 12:06 కి ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ రానుందని.. ఆ రెండు బ్యానర్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాయి. ఈ ఏడాది ఈ రెండు బ్యానర్లు కలిసి నిర్మించిన 'కార్తికేయ-2' పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరో సీక్వెల్ మూవీ 'గూఢచారి-2'తోనూ అదే రిజల్ట్ రిపీట్ చేస్తారేమో చూడాలి.
'గూఢచారి-2'కి మొదటి పార్ట్ డైరెక్టర్ శశికిరణ్ దర్శకత్వం వహించే అవకాశముంది. శేష్ హీరోగా ఈ ఏడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మేజర్' సైతం పాన్ ఇండియా రేంజ్ లో విజయాన్ని సాధించడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



