చై-సామ్ బైక్ రైడింగ్!
on May 15, 2020

టాలీవుడ్‌లోని అందమైన జంటల్లో నాగచైతన్య, సమంత జంట ఒకటి. వృత్తిపరంగా ఒకరినొకరు ఎంతగానో సపోర్ట్ చేసుకుంటూ వస్తోన్న ఆ ఇద్దరూ హాలిడేస్‌లో సరదాగా సమయాన్ని గడుపుతుంటారు. చై-సామ్‌గా ఫ్యాన్స్ పిలుచుకొనే ఆ ఇద్దరూ వివాహానంతరం కలిసి నటించిన 'మజిలీ' సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది. లాక్‌డౌన్ ముందు వరకూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ వచ్చిన సమంత.. లాక్‌డౌన్ మొదలైన చాలా రోజుల దాకా మౌనంగా ఉండటంతో రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. తిరిగి ఇటీవలే మళ్లీ యాక్టివ్ అయ్యింది సమంత. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఆమె షేర్ చేసిన పిక్చర్ ఫ్యాన్స్‌ను బాగా ఖుషీ చేసింది. అందులో చైతన్యతో కలిసి బైక్ రైడింగ్‌కు వెళ్లినట్లు ఉంది సమంత.
దానికి ఆమె ఎలాంటి క్యాప్షన్ పెట్టలేదు. ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన జంటను ప్రశంసిస్తూ రకరకాల కామెంట్లు పెట్టారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఎక్కడికి వెళ్లారంటూ కొంత మంది అడిగారు. గమనిస్తే.. అది ఇప్పటి ఫొటో కాదనీ, మునుపు ఎక్కడికో బైక్ రైడింగ్‌కు వెళ్లే ముందు దిగిన ఫొటో అని అర్థమవుతుంది. 2017లో గోవాలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చైతన్య, సమంత వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ఆ విషయంలో చైతన్య ఆమెకు ఎలాంటి అభ్యంతరం తెలుపకుండా పూర్తిగా సహకరిస్తూ వస్తున్నాడు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న 'లవ్ స్టోరి' మూవీలో సాయిపల్లవితో కలిసి నటిస్తున్నాడు చైతన్య. మరోవైపు నయనతారతో కలిసి తమిళంలో ఓ సినిమా చేయడానికి సమంత అంగీకారం తెలిపింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



