రోడ్ యాక్సిడెంట్‌లో యంగ్ డైరెక్టర్ దుర్మరణం
on May 15, 2020

దేశమంతా కొవిడ్-19 వ్యాప్తితో సతమతమవుతుండగా, ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద షాక్ తగిలింది. టాప్ డైరెక్టర్ శంకర్ శిష్యుడు, యంగ్ డైరెక్టర్ ఎ.వి. అరుణ్ ప్రసాద్ శుక్రవారం ఉదయం ఒక రోడ్ యాక్సిడెంట్‌లో దుర్మరణం పాలయ్యాడు. మీడియా రిపోర్టుల ప్రకారం, కోయంబత్తూరులోని మెట్టుపాలయమ్ దగ్గర జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో అరుణ్ ప్రసాద్ చనిపోయాడు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో అతను ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడనే విషయం వెల్లడి కాలేదు. శంకర్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన అరుణ్ ప్రసాద్ '4జి' అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. అందులో జీవీ ప్రకాశ్ కుమార్, గాయత్రి సురేశ్ జంటగా నటించారు. దురదృష్టవశాత్తూ రెండేళ్ల క్రితమే ఆ సినిమా షూటింగ్ పూర్తయినా, ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.
అరుణ్ ప్రసాద్ మృతికి ఇటు శంకర్, అటు జీవీ ప్రకాశ్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నివాళులు అర్పించారు. "యంగ్ డైరెక్టర్, నా మాజీ అసిస్టెంట్ అరుణ్ ఆకస్మిక మృతితో నా గుండె పగిలింది. నువ్వెప్పుడూ స్వీట్‌గా, పాజిటివ్‌గా ఉండేవాడివి. కష్టజీవివి. నీతో నా ప్రార్థనలు ఎప్పటికీ ఉంటాయి. నీ ఫ్యామిలీకి, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం" అని శంకర్ పోస్ట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



