స్టార్ దర్శకుడు శంకర్‌కి మరో షాక్
on May 15, 2020

సౌతిండియన్ స్టార్ దర్శకుడు శంకర్‌కి 2020 ఏమాత్రం కలిసి రావడం లేదు. ఆయనకు దెబ్బ మీద దెబ్బ తగులుతూ వస్తోంది. లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఇయర్ స్టార్టింగ్‌లో ఆ సినిమా సెట్స్‌లో ప్రమాదం జరిగింది. క్రేన్ కింద పడడంతో సెట్‌లో ఆయన అసిస్టెంట్ ఒకరు, ఇతర సిబ్బంది మరణించారు. అప్పుడు ఆయన చాలా బాధ పడ్డారు. కొన్ని రోజులు షూటింగ్ ఆగింది. తర్వాత కరోనా ఎఫెక్ట్ వల్ల మళ్లీ షూటింగ్ స్టార్ట్ కాలేదు. దెబ్బ మీద దెబ్బ తగలడంతో తీవ్ర నిర్వేదంలో ఉన్న శంకర్‌కు ఈ రోజు మరో షాక్ తగిలింది.

ఆయన దగ్గర గతంలో అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసిన అరుణ్ మృతి చెందారు. అతడి మరణవార్త విని గుండె పగిలిందని శంకర్ ట్వీట్ చేశారు. స్వీట్, పాజిటివ్, హార్డ్ వర్కింగ్ పర్సన్ అని ఆయన కొనియాడారు. శంకర్ దగ్గర కొన్ని సినిమాలకు పని చేశాక అతడు డైరెక్టర్ అయ్యాడు. జీవీ ప్రకాష్ హీరోగా ‘4 జి’ సినిమా తీశాడు. రోడ్డు ప్రమాదంలో అరుణ్ మృతి చెందినట్టు కొందరు చెబుతున్నారు. బుల్లెట్ కిందపడిన ఫొటోలు ట్వీట్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



