మాస్టర్ ప్లాన్.. 'వీర సింహా రెడ్డి'కి చిరంజీవి, 'వాల్తేరు వీరయ్య'కి బాలకృష్ణ!
on Dec 25, 2022

ఈ సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి'తో బాలకృష్ణ, 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి బాక్సాఫీస్ వార్ కి దిగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం విశేషం. ఒకే బ్యానర్ నుంచి ఒకే సమయంలో రెండు భారీ చిత్రాలు విడుదలవుతుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో మైత్రి అదిరిపోయే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఇరు హీరోల ఫ్యాన్స్ హర్ట్ కాకుండా మైత్రి చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. రెండు చిత్రాలకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని ఒక దాని తర్వాత ఒకటి విడుదల చేస్తూ.. రెండు సినిమాలపైనా హైప్ పెంచుతోంది. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ల ఈవెంట్ల విషయంలోనూ మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం.
'వీర సింహా రెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 6న ఒంగోలులో నిర్వహించనుండగా.. 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 8న వైజాగ్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు 'వీర సింహా రెడ్డి' ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవిని, 'వాల్తేరు వీరయ్య' ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా బాలకృష్ణని తీసుకొచ్చేలా ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే టాలీవుడ్ లో మరో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టినట్లు అవుతోంది. ఈ సంక్రాంతి చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ కాకుండా.. చిరంజీవి అండ్ బాలకృష్ణలా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



