ENGLISH | TELUGU  

'పుష్ప' ఆగ‌స్ట్ 13న వ‌స్తున్నాడు!

on Jan 28, 2021

 

అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'పుష్ప' రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. ఫ్యాన్స్‌ను సంబ‌రానికి గురిచేస్తూ ఆగ‌స్ట్ 13న ఈ సినిమా విడుద‌ల‌వుతుంద‌ని బ‌న్నీ స్వ‌యంగా వెల్ల‌డించాడు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో ర‌ష్మికా మంద‌న్న హీరోయిన్‌. గురువారం త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను షేర్ చేశాడు బ‌న్నీ. ఇందులో గొడ్డ‌లి ప‌ట్టుకొని ఓ విరిగిపోయిన చెట్టు మొద‌ల్లో పుష్ప పాత్ర‌ధారి అల్లు అర్జున్ కూర్చొని ఉంటే, అత‌ని చుట్టూ అనేక‌మంది గొడ్డ‌ళ్ల‌తో అత‌ని వంకే క్యూరియాసిటీగా చూస్తూ ఉన్నారు. గంధ‌పు చెట్ల‌ను న‌రికే ప‌నివాళ్లుగా వారంతా క‌నిపిస్తున్నారు. వారికి బ‌న్నీ ఏదో చెప్తున్న‌ట్లుగా ఉన్నాడు. 

ఆ పిక్చ‌ర్‌తో పాటు, "#PUSHPA loading in theatres from 13th August 2021. Excited to meet you all in cinemas this year. Hoping to create the same magic one more time with dearest @aryasukku & @ThisIsDSP" అంటూ రాసుకొచ్చాడు బ‌న్నీ.

జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాశ్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, సునీల్‌, హ‌రీశ్ ఉత్త‌మ‌న్‌, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ధారులైన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు ఒరిజిన‌ల్‌తో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ వెర్ష‌న్ల‌లో ఏక కాలంలో  ఆగ‌స్ట్ 13న ఈ సినిమా విడుద‌ల కానున్న‌ది.

దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి మిరోస్లావ్ క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు. 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' లాంటి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత బ‌న్నీ న‌టిస్తోన్న సినిమా కావ‌డం, 'రంగ‌స్థ‌లం' లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ త‌ర్వాత సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డంతో పుష్ప‌పై అంచ‌నాలు అంబ‌రాన్ని చుంబిస్తున్నాయి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.