సురేశ్ బొబ్బిలి.. రెండు వారాల్లో మూడు చిత్రాలు!
on Jun 15, 2022

`నీదీ నాదీ ఒకే కథ` (2018), `జార్జి రెడ్డి` (2019) చిత్రాలతో స్వరకర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సురేశ్ బొబ్బిలి. కాగా, ఈ జూన్ నెలలో కేవలం రెండు వారాల వ్యవధిలో ముచ్చటగా మూడు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ఈ టాలెంటెడ్ కంపోజర్.
ఆ వివరాల్లోకి వెళితే.. `నీదీ నాదీ ఒకే కథ` ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం `విరాట పర్వం`. రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్ వంటి ప్రముఖ తారాగణంతో నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం.. జూన్ 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతమందించాడు. కట్ చేస్తే.. జూన్ 24న `జార్జి రెడ్డి` డైరెక్టర్ జీవన్ రెడ్డి కాంబినేషన్ లో సురేశ్ బొబ్బిలి మరోసారి కలిసి పనిచేసిన `చోర్ బజార్` రిలీజ్ కానుంది. ఇందులో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరో. అలాగే, అదే జూన్ 24న శ్రీరామ్, అవికా గోర్ జంటగా `గరుడవేగ` అంజి రూపొందించిన `టెన్త్ క్లాస్ డైరీస్` రిలీజ్ కానుంది. ఈ చిత్రానికీ సురేశ్ బొబ్బిలి బాణీలు కట్టాడు. మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ మూడు చిత్రాలతో సంగీత దర్శకుడిగా సురేశ్ బొబ్బిలి స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



