`కృష్ణ` త్రయం మల్టిస్టారర్ `సుల్తాన్`కి 23 ఏళ్ళు!
on May 27, 2022

టాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన మల్టిస్టారర్స్ లో `సుల్తాన్` ఒకటి. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, విలన్ గా రెండు విభిన్న పాత్రలు పోషించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రధాన పాత్రల్లో దర్శనమిచ్చారు. బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు.. ఇలా `కృష్ణ` త్రయంతో కుటుంబ కథా చిత్రాల స్పెషలిస్ట్ శరత్ తెరకెక్కించిన ఈ మల్టిస్టారర్ ని.. పి.బి. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బాలకృష్ణ సమర్పణలో ఎం. ఆర్. వి. ప్రసాద్ నిర్మించారు. అంతేకాదు.. ఎం.ఆర్. వి. ప్రసాద్ నే కథను అందించడం విశేషం. `సమరసింహారెడ్డి` (1999) వంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం బాలయ్య నుంచి వెనువెంటనే వచ్చిన ఈ చిత్రం.. యాక్షన్ ప్రియులను భలేగా ఆకట్టుకుంది. మరీముఖ్యంగా.. `సుల్తాన్`గా టైటిల్ రోల్ లో బాలయ్య అభినయం అభిమానులను ఫిదా చేసింది.
బాలకృష్ణ సరసన రోజా, రచన, దీప్తి భట్నాగర్ నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, రవిబాబు, సత్యప్రకాశ్, అన్నపూర్ణ, సుధ, శివ పార్వతి ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. కోటి సంగీతమందించిన ఈ చిత్రంలో ``ఓ కలికి రామచిలకా``, ``పంచదార చెట్టుమీద``, ``చిమ చిమ``, ``నంది కొండ మీద``, ``ఆకాశం గుండెల్లో``, ``షబ్బా షబ్బారే`` అంటూ మొదలయ్యే పాటలన్నీ ఆకట్టుకున్నాయి. కాగా, 1999 మే 27న విడుదలైన `సుల్తాన్`.. నేటితో 23 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



