చిరు-బాలయ్య కాంబోలో అల్లు అరవింద్ పాన్ వరల్డ్ మూవీ!
on Dec 1, 2022
సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణలకు ఉండే క్రేజే వేరు. వాళ్ళ సినిమాలు వస్తున్నాయంటే థియేటర్ల దగ్గర హంగామా మాములుగా ఉండదు. వాళ్ళ బాక్సాఫీస్ వార్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటిది ఆ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తే ఇంకేమైనా ఉందా?. వెండితెరపై అసలుసిసలు తెలుగు సినిమా పండగ చూడొచ్చు. అలాంటి పండగనే తీసుకురావడానికి బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.
బాలకృష్ణ హోస్ట్ గా ఓటీటీ వేదిక ఆహాలో 'అన్ స్టాపబుల్' షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ శతజయంతితో పాటు 90 ఏళ్ల తెలుగు సినిమా సెలబ్రేషన్స్ లో భాగంగా ప్లాన్ చేసిన ఐదో ఎపిసోడ్ కి సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి హాజరయ్యారు. రేపటి(డిసెంబర్ 2) నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుండగా, తాజాగా ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. అందులో చిరు-బాలయ్య కాంబినేషన్ గురించి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"మన ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు?" అని బాలయ్య అడగగా.. "మీతో, చిరంజీవి గారితో కలిపి సినిమా చేద్దామని చూస్తున్నా" అని అరవింద్ చెప్పారు. దీంతో బాలయ్య "అప్పుడు అది పాన్ వరల్డ్ అవుతుంది" అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. నిజంగానే వీరి కాంబోలో సినిమా వస్తే ఓ రేంజ్ లో ఉంటుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read