సీతారామం ఫేమ్ కి మరో బిగ్ ఆఫర్!
on Feb 9, 2023

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం సీతారామం. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం అందరి హృదయాలలో తిష్ట వేసింది. ఫీల్ గుడ్ మూవీగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలలో కలకాలం నిలిచిపోయేలా రూపొందింది. ముఖ్యంగా ఇందులో హీరోయిన్‌గా నటించిన మృణాల్ ఠాకూర్ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంది. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుంది. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. దాంతో ఆమెకు తెలుగులో మంచి క్రేజీ వచ్చింది. ప్రస్తుతం ఆమె నాని హీరోగా నటిస్తున్న నాని 30వ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు ఈమెకు మరో భారీ ప్రాజెక్టులో అవకాశం వచ్చిందని సమాచారం.
త్వరలో కింగ్ నాగార్జున ఓ చిత్రం చేయనున్నారు. రచయితగా సినిమా చూపిస్త మామ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే రా, ధమాకా సినిమాలతో మంచి ఊపు మీద ఉన్న రచయిత ప్రసన్నకుమార్ బెజవాడను నాగార్జున దర్శకునిగా పరిచయం చేయనున్నారు. ఇప్పటికే చాలామంది రచయితలు దర్శకులుగా మారి సక్సెస్ఫుల్‌గా కొనసాగుతున్నారు. కొరటాల శివా నుంచి ఎందరో ఇదే కోవకి చెందుతారు. ఈ నేపథ్యంలో ప్రసన్నకుమార్ పై నాగార్జున నమ్మకం ఉంచారు. ఆయనకు పెన్ పవర్ తో పాటు స్టార్ దర్శకుడు అయ్యే లక్షణాలు ఉన్నాయని నాగార్జున భావిస్తున్నారు.
కాగా ఇందులో అల్లరి నరేష్ కూడా కీలకపాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. నాగార్జున కిరీర్ లో ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ మూవీగా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ చిత్రం ఓ మలయాళ సినిమా హిట్ కు రీమేక్ అని తెలుస్తోంది. మరి ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ నాగార్జునకు సరసన నటించనుందా? లేదా ఏదైనా కీలక పాత్రలో కనిపించనుందా లేకపోతే అల్లరి నరేష్కు జోడిగా కనిపిస్తోందా? ఈమెకంటూ సపరేట్ క్యారెక్టర్ ఉందా? అనే సందేహాలు వస్తున్నాయి. మరి వీటిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



