హిట్టు కొట్టి మీ ముందుకు వస్తానంటున్న కొరటాల!
on Feb 10, 2023

ఇటీవల కాలంలో దర్శకునిగా కొరటాల శివ పై వచ్చినంత ఆరోపణలు మరెవరిపై రాలేదని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసి ఈయన తీసిన ఆచార్య చిత్రం డిజాస్టర్ అయ్యింది. దాంతో ఈయన తీవ్ర అవమానాలకు గురయ్యారు. కొరటాల శివ గత కొన్ని నెలలుగా మీడియా ముందుకు రావడం లేదు. సోషల్ మీడియాలో కూడా ఆయన కనిపించడం లేదు. ఆయన దృష్టి అంతా ఎన్టీఆర్ 30వ చిత్రం పైనే ఉంది. ఈ సినిమాతో హిట్టు కొట్టిన తర్వాత మాత్రమే మీడియా ముందుకు రావాలనే పట్టుదలతో ఉన్నాడట.
ఆచార్య చిత్రం తర్వాత అందరూ తనను టార్గెట్ చేయడంతో కొరటాల శివ చాలా బాధపడుతున్నాడని సమాచారం. ఇటీవల పలు సినిమా ఈవెంట్స్ కు ఆయన్ను ముఖ్య అతిథిగా చాలామంది ఆహ్వానించారు. కానీ ఆయన మాత్రం ఆ ఆహ్వానాలను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడట. తాజాగా ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొనకుండా తన వీడియో బైట్ పంపించి చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం కొరటాల శివ చాలా కసిగా ఉన్నారు. ఆచార్య డిజాస్టర్ కు కేవలం తాను ఒక్కడినే కారణం కాదని ఆయన ఎన్టీఆర్ 30వ చిత్రంతో మాటలతో కాకుండా చేతులతో నిరూపించాలని భావిస్తున్నాడట.
అందుకే తన ప్రాణాలకు ఒడ్డి తన సర్వశక్తులను ఎన్టీఆర్ 30 చిత్రంపై కేటాయిస్తున్నాడని తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం పట్టాలేకపోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఎలాగైనా ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజీ తరహా హిట్టును కొడితే మరల శివాకు క్రేజీ రెట్టింపు అవుతుంది. అలాంటి మధుర క్షణం కోసమే ఆయన సన్నిహితులు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



