పవన్ కి కీరవాణి తనవంతు సాయం!
on Feb 9, 2023

బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ చిత్రాల తర్వాత కీరవాణి రేంజి నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ చేరింది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆయన అందించిన సంగీతం హాలీవుడ్ ప్రముఖుల ప్రముఖుల ప్రశంసలు కూడా చూరగొంది. అయితే ఈ మధ్య కీరవాణి ప్రతి చిత్రాన్ని ఒప్పుకోకుండా తన మనసుకు నచ్చిన చిత్రాలను మాత్రమే చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చిత్రాలకు ఎక్కువగా పని చేస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ తో క్రిష్ జాగర్లమూడి తీస్తున్న హరిహర వీరమల్లు చిత్రం లైన్ లోకి వచ్చింది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత కీరవాణి సంగీతం అందిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఏకంగా నాటు నాటు సాంగు తో ప్రపంచ స్థాయికి ఎదిగిన కీరవాణి హరిహర వీర మల్లుకు సంగీతం అందించడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
ఎందుకంటే ఇది పబ్లిసిటీ పరంగా కూడా ఉపయోగపడుతుంది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంగీతం అందించిన కీరవాణినే సంగీతం అందిస్తున్నాడని అన్ని భాషల్లో ఓ టాక్ అయితే వచ్చింది. అది బహుశా పాజిటివ్‌గా పవన్ సినిమాకు హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనీసం ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ కూడా లేదు. గత ఏడాది ఎప్పుడో మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ వదిలారు. మరల అప్పటి నుండి అప్డేట్ లేదు. శివరాత్రి సందర్భంగా ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ సాంగ్ గా ఉంటుందని సమాచారం. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో పాటు ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ కి వెళ్ళిన వ్యక్తి ఎంఎం కీరవాణి. ఆయన సంగీత అంధిస్తూ ఉండడంతో హరిహర వీరవల్లికి కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ వచ్చింది ఇక శివరాత్రికి పవన్ కళ్యాణ్ కోసం కీరవాణి అందిస్తున్న సాంగ్ మాయ చేస్తుందని మాయ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అలాంటి సాంగ్స్ చేస్తున్నారు. అతని హీరో ఎలివేషన్ కూడా రాజమౌళి కంటే భిన్నంగా ఉంటుంది.ఈ నేపథ్యంలో కీరవాణి నుంచి రాబోతున్న హరిహర వీరమల్లు ఫస్ట్ సాంగ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి శివరాత్రి సందర్భంగా పవన తాజా చిత్రం సాంగ్ వీర ఎలివేషన్స్ రాజమౌళి కంటే ఎలా విభిన్నంగా ఉంటాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు చిత్రానికి కీరవాణి అందించే సాంగ్స్ ఎలా ఉంటాయి? ఈచిత్రానికి కీరవాణి చిత్రం ఎంత వరకు ఉపయోగపడుతుందనే విషయంలో అందరిలో పాజిటివ్ వైబ్రేషన్సే ఉన్నాయని చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



