మిస్టర్ మజ్ను... అఖిల్ అత్తారిల్లు?
on Nov 1, 2018

అత్తారిల్లు.. అదేనండీ 'అత్తారింటికి దారేది'... పవన్ కల్యాణ్ అభిమానులకు ప్రత్యేకమైన సినిమా! పవన్ 'అత్తారింటికి దారేది' అంటూ వస్తే... ఆయనకు రికార్డుల దారి చూపించారు ప్రేక్షకులు! మనస్పర్థల వల్ల కుటుంబానికి దూరమైన మేనత్తను తిరిగి తాతయ్య దగ్గరకు తీసుకురావడానికి ఓ మేనల్లుడు చేసిన ప్రయత్నమే చిత్రకథ. సినిమాలోని కుటుంబ అనుబంధం, వినోదం ప్రేమ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. సినిమాను ఒకటికి పదిసార్లు చూసిన ప్రేక్షకులు ఎంతోమంది.... అటువంటి వారిలో అక్కినేని అఖిల్ ఒకరు! అఖిల్‌కి 'అత్తారింటికి దారేది' సినిమా అంటే ఎంతో ఇష్టమట. ఇన్‌ఫ్యాక్ట్... అతను హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'మిస్టర్ మజ్ను'లో చాలా సన్నివేశాలు 'అత్తారింటికి దారేది' సినిమాలో సన్నివేశాల స్ఫూర్తితో రాసుకున్నవే అట!
'తొలిప్రేమ'తో దర్శకుడిగా పరిచయమైన నటుడు వెంకీ అట్లూరి. మధుర శ్రీధర్ 'స్నేహ గీతం' సినిమాలో అతను ఒక హీరోగా నటించాడు. ఆ సంగతి చాలామంది మర్చిపోయారు. అందువల్ల, అది పక్కన పెడితే.. 'తొలిప్రేమ' తరవాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'మిస్టర్ మజ్ను'. హీరో అఖిల్ కోరిక మేరకు 'అత్తారింటికి దారేది' తరహాలో, ఆ సినిమా స్ఫూర్తితో ప్రేమ, వినోదాత్మక సన్నివేశాలను 'మిస్టర్ మజ్ను' కోసం కొత్త కొత్త సన్నివేశాలు రాశార్ట! హిందీలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన 'యే జవానీ హై దివాని' తరహా కథతో 'మిస్టర్ మజ్ను' తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి. అఖిల్ సినిమా హిందీ సినిమాలా వుంటుందో? పవన్ 'అత్తారిల్లు'లా వుంటుందో? వెయిట్ అండ్ సీ!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



