పందితో పాదయాత్ర
on Nov 1, 2018

రాజకీయ నాయకులు ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్రలు చేయడాన్ని ప్రజలు చూసుంటారు. తమ సినిమాకు ఘన విజయాన్ని కట్టబెట్టినందుకు హీరోలు, సినిమా ప్రముఖులు విజయ యాత్రలు... ప్రేక్షకులు, అభిమానులతో కలిసి పాదయాత్రలు చేయడానికి తెలుగు ప్రజలు చూసుంటారు. ఎప్పుడైనా ఒక పందిపిల్లతో సినిమా దర్శకులు పాదయాత్ర చేయడాన్ని చూశారా? శుక్రవారం మధ్యహ్నం 3.30 గంటలకు చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు దర్శకుడు రవిబాబు. ఆసక్తి కలవారు పందితో పాదయాత్రలో పాల్గొనవచ్చు కూడా! విభిన్న, విలక్షణ చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు రవిబాబు. ఆయన పందిపిల్లను ప్రధాన పాత్రలో పెట్టి 'అదుగో' అని ఒక సినిమా తీసిన సంగతి తెలిసిందే. వినూత్న పద్ధతుల్లో సినిమాకు ప్రచారం చేస్తున్న రవిబాబు బృందం... శుక్రవారం 3.30 గంటలకు హైదరాబాద్, ఫిలింనగర్ లోని కేబీఆర్ పార్క్ నుంచి ఫిలింఛాంబర్ వరకూ పాదయాత్ర చేయడానికి సిద్ధమైంది. ఆసక్తి కలవారు పాల్గొనవచ్చు. రవిబాబు ఐడియా కొత్తగా వుంది కదూ!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



