రాజేంద్రప్రసాద్ కనిపించడం లేదు
on Mar 7, 2017

`మా` కొత్త అధ్యక్షుడిగా శివాజీ రాజా ఎంపికయ్యారు. మిగిలిన సభ్యుల్నీ ఏకగ్రీవంగా ఎంపిక చేసుకొన్నారు. అంతా బాగానే ఉంది. మరైతే... పాత అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మొత్తం వ్యవహారంలో మిస్ అయ్యారు. `మా` ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లలో రాజేంద్ర ప్రసాద్ గైర్హాజరీ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మా కొత్త అధ్యక్షుడిగా శివాజీ రాజా పేరుని ప్రదిపాదించినప్పుడు, ఆయన్ని ఏక గ్రీవంగా ఎంపిక చేసినప్పుడూ.. రాజేంద్ర ప్రసాద్ కనిపించలేదు.
దాంతో.. శివాజీ రాజా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం రాజేంద్ర ప్రసాద్‌కు ఇష్టం లేదా?? అనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఎన్నికల్లో నరేష్‌పై వీరోచితంగా పోరాడి, అనూహ్యంగా గెలిచాడు రాజేంద్ర ప్రసాద్. ఈ రెండేళ్లలో `మా` అభ్యున్నతికి రాజేంద్ర ప్రసాద్ చాలానే కృషి చేశారు. అందుకే ఈసారీ రాజేంద్ర ప్రసాదే మా అధ్యక్షుడు అవుతాడనుకొన్నానంతా. అయితే అనుకోకుండా.. శివాజీ రాజా పేరొచ్చింది. `మా` కోసం శివాజీ రాజా చేసిన కృషి చూసి తనకే `మా` పగ్గాలు అప్పగించాలని సినీ పెద్దలు నిర్ణయం తీసుకోవడం వల్ల రాజేంద్రుడు తప్పుకోవాల్సివచ్చింది. కనీసం ప్రస్తుత అధ్యక్షుడి హోదాలో అయినా.. ప్రెస్ మీట్లకు రావాల్సిన రాజేంద్ర ప్రసాద్.. వాటికి డుమ్మా కొట్టడం, తన స్పందన తెలియజేయకపోవడం చర్చనియాంశమైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



