అలా చేస్తే పృథ్వీకి అవకాశాలు తగ్గుతాయా..?
on Mar 8, 2017

అప్పుడెప్పుడో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేశాడు పృథ్వీరాజ్ అలియాస్ థర్టీ ఇయర్స్ పృథ్వీ. కాని కాలం కలిసిరాకపోవడంతో ఒకటి ఆరా సినిమాలతోనే నెట్టుకొచ్చాడు. అయితే ఖడ్గం సినిమాలోని 30 ఇయర్స్ డైలాగ్స్ పృథ్వీని ఓవర్‌నైట్ స్టార్‌ని చేసేసింది. ఆ థర్టీ ఇయర్స్ ట్యాగ్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా గోపిచంద్ లౌక్యం సినిమాతో ఆయన దశ తిరిగింది.. ఆ తర్వాత ఇతర సినిమాల్లో హీరోలు చేసిన పాత్రలను అనుకరిస్తూ పృథ్వీ చేసిన పేరడీలు బాగా పేలడంతో అవకాశాలు క్యూకట్టాయి.
దీంతో పృథ్వీని టాప్ కామెడీయన్‌గా మారిపోయాడు..అయితే పృథ్వీ చేసిన పలు పేరడీలు స్టార్ హీరోల అభిమానులను మనస్తాపానికి గురిచేశాయి. ముఖ్యంగా నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు నేరుగా రంగంలోకి దిగి బాయిలింగ్ స్టార్‌కి వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఇక నుంచి తాను ఏ హీరోను అవమానపర్చాలనే ఉద్దేశ్యంతో చేసింది కాదని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఇకపై పేరడీలు చేయను అని డిసైడయ్యాడట. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి..పృథ్వీకి స్టార్ స్టేటస్ వచ్చిందే పేరడీలతో అలాంటిది పేరడీలను వదులుకుంటే అవకాశాలు తగ్గుతాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



