త్రివిక్రమ్‌కి ఇంత వరకు సొంత ఇల్లు లేదా..?
on Mar 7, 2017
త్రివిక్రమ్ శ్రీనివాస్ ..తూటాల్లాంటి మాటలతో రైటర్‌కి స్టార్ స్టేటస్ తెచ్చిన వ్యక్తి. మెగాఫోన్ పట్టి సూపర్‌హిట్లు కొట్టిన డైరెక్టర్..తన రేంజ్‌కు తగ్గట్టే ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకునే వారిలో ఒకరు. అలాంటి వ్యక్తికి హైదరాబాద్‌లో ఇంత వరకు సొంతిల్లు లేదంటే నమ్ముతారా..? కాని ఇది నిజం. సినిమాల మీద పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఆయన భాగ్యనగరంలో అద్దె ఇంట్లోనే వుంటూ వస్తున్నారు..పార్క్ హయత్ హోటల్‌లోనూ.. అద్దె అపార్ట్‌మెంట్లలోనూ ఉండేవారు.
అయితే గతేడాది ఫిల్మ్‌నగర్‌లో ఓ స్థలం కొనుగోలు చేసి తన అభిరుచికి తగ్గట్టుగా ఇల్లు కట్టించుకున్నాడట త్రివిక్రమ్. ఏప్రిల్ 29న ఆయన తన కొత్తింట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పవన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ఆప్తులను ఆహ్వానించనున్నాడట. ఇంత కాలానికి త్రివిక్రమ్ ఓ ఇంటివాడు కాబోతుండటంతో అతని కుటుంబసభ్యులు, సన్నిహితులు ఫుల్ ఖుషీగా ఉన్నారట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
