కీరవాణి రుచులు.. అభిరుచులు
on Jul 4, 2017

రుచులు, అభిరుచులు మానవ సహజాలు. అవి లేకపోతే మనిషికి మజా ఏ ముంటుంది? ఎవరి అభిరుచులు, ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నా... సెలబ్రిటీస్ టేస్టులు తెలుసుకోవడంలో మాత్రం జనాలు ఎక్కువ ఆసక్తి చూపించడం సహజం. అందుకే... ఈ రోజు సంగీత స్వరఘరి ఎం.ఎం.కీరవాణి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇష్టాయిష్టాలు, రుచులు, అభిరుచులు మీకోసం.
కీరవాణికి పాట తర్వాత అత్యంత ఇష్టమైంది ఫుడ్. ఆయన మంచి భోజన ప్రియుడు. తినడమే కాదు, తినిపించడంలో కూడా దిట్ట. సంప్రదాయ వంటకాలు ఎక్కువగా ఇప్టపడే కీరవాణిగారు, నాన్ వెజ్ కూడా బాగానే తింటారు. విజిటేరియన్లో కీరవాణికి ఇష్టమైన వంటకం గుత్తి వంకాయ. దానికి తోడుగా పాలకూర పప్పు ఉంటే ఆ రోజు పండుగే ఆయనకు. నాన్ వెజ్లో చికన్ తో చేసింది ఏదైనా ఇష్టంగా తింటారు కీరవాణి.
కీరవాణి అభిరుచికి దర్పణం ఆయన ఇల్లు. మన పూర్వీకులు ఎలాంటి ఇళ్లలో ఉండేవారో అలాగే ఉంటుంది కీరవాణి ఇల్లు కూడా. సాధ్యమైనంత వరకు ఉడ్ వర్క్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన ఇంట్లోకి అడుగుపెట్టగానే.. పల్లెటూరిలో వాతావరణంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
మీ బ్యాడ్ హేబిట్ ఏంటి? అనడిగితే... ‘బద్దకం’ అని సింపుల్ గా చెబుతారాయన. తింటానికి ఇచ్చిన ప్రాముఖ్యత వర్కవుట్లు చేయడానికి ఇవ్వను అంటారు కీరవాణి.
ఇక కెరీర్ విషయానికొస్తే... కీరవాణికి ఇష్టమైన సంగీత దర్శకులు ముగ్గురు. వారే.. కేవీ మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా. తన పాటల్లో కూడా వారిద్దరి ప్రభావం అప్పుడప్పుడు కనిపిస్తుంటుందని నిజాయితీగా చెబుతారు కీరవాణి. ముఖ్యంగా ఇళయరాజా తర్వాత దక్షిణాది పాటలో వచ్చిన మార్పు ఇప్పటికీ కొనసాగుతోందని, అదే దారిలో ఇప్పటికీ పాట పయనం అవుతుందని కీరవాణి అభిప్రాయం.
ఇక నటీనటుల్లో ఎన్టీయార్, ఏఎన్నార్, ఎస్వీయార్, సావిత్రిలను ఎక్కువగా ఇష్టపడతారు. దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు అంటే ఇష్టం. కీరవాణికి ఇష్టమైన గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి.
కీరవాణికి ఇష్టమైన పాట ‘మల్లీశ్వరి’ సినిమాలోని ‘మనసున మల్లెల మాలలూగెనే’.ఆయన స్వరపరచిన పాటల్లో మాతృదేవోభవ’చిత్రంలోని ‘వేణువై వచ్చాను భవనానికి’ఆయన ఇష్టపడే పాట.
ఇక పోతే కీరవాణి మంచి పుస్తకాల పురుగు. పుస్తకం కనిపిస్తే వదలరు. ఆయన మంచి రచనలు కూడా చేయగలరు. కొన్ని సినిమాలకు పాటలు కూడా రాశారు కీరవాణి. ఇవండీ.. కీరవాణి రుచులు, అభిరుచులు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



