సెలబ్రిటీలకే సెలబ్రిటీ ఈ పాప
on Jul 4, 2017
సెలబ్రిటీలకే సెలబ్రిటీలు అంటే పసి పిల్లలే? ముద్దులొలికే చిన్నారి పాపలు కనిపించగానే ఎవరికైనా సరే వారితో ఓ సెల్ఫీ దిగేయాలనిపిస్తుంది. అంత టూమచ్ క్యూట్ నెస్ చూస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఇక్కడ అందాల భామ రెజీనా కసండ్రా కూడా అదే చేసింది.. బూరెబుగ్గలతో క్యూట్ గా ఉన్న ఈ చిన్నారిని చూసి ఆనందం ఆపుకోలేక ఆ అమ్మయితో సెల్ఫీ దిగేసింది. ఇంతకీ ఆ పాప ఎవరనుకుంటున్నారు? తనే మంచు లక్ష్మి ముద్దుల తనయ.. పేరు ’విద్యా నిర్వాణ‘. మొన్న జరిగిన సైమా అవార్డుల వేడుక సందర్భంగా అబుదాబీకి వెళ్లిన సినీ సెలబ్రిటీస్ మధ్య విద్యా నిర్వాణ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.