'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' రెండు వారాల కలెక్షన్స్.. ఎంత రాబట్టిందో తెలుసా!
on Sep 21, 2023
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో మళ్ళీ అభిమానులను పలకరించిన అనుష్కకి.. మంచి ఫలితమే దక్కింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ.. అటు విమర్శకులను, ఇటు ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ ముంగిట బ్లాక్ బస్టర్ స్టేటస్ పొందింది. సెప్టెంబర్ 7న జనం ముందు నిలిచిన ఈ సినిమా.. బుధవారంతో 14 రోజుల (2 వారాలు) ప్రదర్శన పూర్తిచేసుకుంది. రూ. 13.50 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన శెట్టి అండ్ శెట్టి.. ఈ 14 రోజుల్లో రూ. 22.52 కోట్ల షేర్ రాబట్టింది. అంటే.. ఓవరాల్ గా రూ. 9.02 కోట్ల లాభం చూసిందన్నమాట.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 14 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 6.96 కోట్ల షేర్
సీడెడ్ : రూ. 1.18 కోట్ల షేర్
ఆంధ్రా: రూ. 4.75 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.12.89 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 1.74 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.7.89 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా 14 రోజుల కలెక్షన్స్ : రూ.22.52 కోట్ల షేర్ (రూ. 43.50 కోట్ల గ్రాస్)

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
