‘నీ......’, ‘డుర్‌ర్‌ర్‌ర్...’ ఏమిటిది లక్ష్మీ?!
on Sep 21, 2023
మంచు లక్ష్మీ వార్తల్లోకి వచ్చిందంటే అందరూ ఎంతో ఇంట్రెస్ట్‌గా చూస్తారు. మంచు లక్ష్మీ అలా ఎందుకు ప్రవర్తించింది అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా నెటిజన్లు ఈ విషయంలో చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతారు. ఆమెను ట్రోల్ చేయడానికి, కామెంట్ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇలాంటి ట్రోలింగ్‌లను పట్టించుకోని లక్ష్మీ తన పని తను చేసుకుంటూ పోతుంది.
ఇదే క్రమంలో ఇప్పుడు మంచు లక్ష్మీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్‌లో మంచు లక్ష్మీ పాల్గొంది. ఫంక్షన్ ప్రారంభానికి ముందు ఒక టివి ఛానల్‌తో చిట్ చాట్‌లో ఉండగా కెమెరాకు ఒక వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దాంతో సీరియస్ అయిన ఆమె అతని వీపు మీద చరిచింది. ఆ తర్వాత మరో వ్యక్తి అడ్డు వచ్చాడు. అతను దెబ్బల నుంచి తప్పించుకున్నాడు. ‘డ్యూడ్ కెమెరాకు అడ్డు రాకుండా ఉండడం అనేది బేసిక్’ అంటూ ‘నీ.......’ అనే అన్ పార్లమెంటరీ వర్డ్‌ను కూడా వాడిరది. అలాగే ‘డుర్‌ర్‌ర్...’ అంటూ కెమెరాకి అడ్డు వచ్చినవారిని మందలించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు లక్ష్మీని టార్గెట్ చేస్తూ ‘ఏమిటిది లక్ష్మీ?’ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
