అందర్నీ భయపెట్టడానికి వస్తున్న ఫైర్ బ్రాండ్!
on Sep 21, 2023
హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ లాంటిది. పవర్‌ఫుల్ క్యారెక్టర్స్, నెగెటివ్ క్యారెక్టర్స్ చేయడంలో ఆమెకు ఆమే సాటి. హీరోకి ఏమాత్రం తగ్గకుండా ఉండే ఆమె పెర్‌ఫార్మెన్స్‌కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ ఇప్పుడు ఓ హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా ఎవరిదైనా తన క్యారెక్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్‌ని బట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్ళే వరలక్ష్మీ ఇప్పుడు వెబ్ సిరీస్‌లో కూడా నటించడానికి ఓకే చెప్పింది.
తెలుగులో ‘రాజుగారి గది’ వంటి హారర్ మూవీని తెరకెక్కించిన ఓంకార్ డైరెక్షన్‌లో రూపొందుతున్న వెబ్ సిరీస్ ‘మ్యాన్షన్ 24’. ఒక మ్యాన్షన్‌కి వెళ్లిన కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు. అనుకోకుండా ఆ మ్యాన్షన్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అయితే వారు అందులో ఇరుక్కోవడానికి కారణం ఏమిటి? ఆ మ్యాన్షన్ నుంచి వారు బయటపడ్డారా? అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో బిందుమాధవి, అవికా గోర్, అభినయ, సత్యరాజ్, రావు రమేశ్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
