కరోనా బారిన పడిన మెగాస్టార్
on Jan 26, 2022

ఇటీవల పలువురు సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. వారిలో మహేష్ బాబు, కీర్తి సురేష్, మీనా, త్రిష వంటి వారు ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా సోకింది.
తనకి కరోనా సోకిందని తాజాగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలిపారు. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.
కాగా, చిరంజీవి ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ని కలిశారు. అలాగే రవితేజ 'రావణాసుర' మూవీ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. అలాగే ఆయన కొద్దిరోజులుగా 'భోళా శంకర్' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో అందరిలోనూ కొంత ఆందోళన నెలకొంది.
మరోవైపు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన 'గుడ్ లక్ సఖి' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగనుంది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ ఈవెంట్ చిరు రాకుండానే జరగనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



