బర్త్ డే స్పెషల్: రవితేజకి గోల్డెన్ ఇయర్ అదే!
on Jan 26, 2022
కథానాయకుడిగా మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఎన్నో విజయాలున్నాయి. అయితే, ఒకే క్యాలెండర్ ఇయర్ లో వరుసగా మూడు విజయాలు అందుకున్న వైనం మాత్రం ఒకటే ఉంది. వాటిలో రెండు సినిమాలు ఒకే నెలలో రిలీజవ్వడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. 1999లో విడుదలైన `నీ కోసం` చిత్రంతో సోలో హీరోగా మారిన రవితేజ.. 2001లో రిలీజైన `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`తో కథానాయకుడిగా మొదటి సూపర్ హిట్ చూశారు. ఇక 2002 సంవత్సరం అయితే రవితేజకి గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. జస్ట్ 120 రోజుల వ్యవధిలో మూడు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ చూశారు మాస్ మహారాజా. ఆ చిత్రాలే.. `ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు`, `ఇడియట్`, `ఖడ్గం`.
సీనియర్ దర్శకుడు వంశీ తెరకెక్కించిన `ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు` 2002 ఆగస్టు 2న తెరపైకి రాగా.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీర్చిదిద్దిన `ఇడియట్` 2002 ఆగస్టు 22న సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన మల్టిస్టారర్ `ఖడ్గం` నవంబర్ 29న సందడి చేసింది. ఇందులో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ తో కలిసి నటించారు రవితేజ. మొత్తమ్మీద.. ఒకే ఏడాదిలో ఇలా తక్కువ గ్యాప్ లోనే హీరోగా మూడు విజయాలు చూసి వార్తల్లో నిలిచారు రవితేజ. వీటిలో `ఇడియట్` చిత్రమైతే తన కెరీర్ ని మేలిమలుపు తిప్పిన సినిమాగా నిలిచింది. మొత్తంగా.. రవితేజకి 2002 గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
