Home

»

Latest News

అనుష్క 'భాగ‌మ‌తి'కి నాలుగేళ్ళు!

Jan 26, 2022 12:38PM

తెలుగునాట ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన క‌థానాయిక‌ల్లో అనుష్క ఒక‌రు. సెన్సేష‌న‌ల్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ `అరుంధ‌తి` (2009) త‌రువాత అనుష్క.. ఆ త‌ర‌హాలో మ‌రికొన్ని సినిమాలు చేసినా విజ‌య‌తీరాల‌కు చేరిన చిత్రాలు త‌క్కువే. వాటిలో `భాగ‌మ‌తి` (2018) ఒక‌టి. ఓవ‌ర్సీస్ `మిలియ‌న్ డాల‌ర్` క్ల‌బ్ లో చేరిన తొలి తెలుగు విమెన్ సెంట్రిక్ మూవీగా `భాగ‌మ‌తి` అప్ప‌ట్లో రికార్డుల‌కెక్కింది.  జి. అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ ద్విభాషా చిత్రంలో ఐఏఎస్ అధికారిణి చంచ‌ల‌గా త‌న‌దైన అభిన‌యంతో ఆక‌ట్టుకుంది అనుష్క‌. అలాగే `భాగ‌మ‌తి`గా కాసేపు మెస్మ‌రైజ్ చేసింది.

జ‌య‌రామ్, ఉన్ని ముకుంద‌న్, ఆశా శ‌ర‌త్, ముర‌ళీ శ‌ర్మ‌, ధ‌న్ రాజ్, ప్ర‌భాస్ శ్రీ‌ను, విద్యుల్లేఖ రామ‌న్, నాగినీడు, మ‌ధుసూద‌న్, దేవ‌ద‌ర్శిని, అజ‌య్ ఘోష్, ర‌జిత ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి యువ సంగీత సంచ‌ల‌నం ఎస్. త‌మ‌న్ బాణీలు, నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. ఆర్. మ‌ధి ఛాయాగ్ర‌హ‌ణం మ‌రో ఎస్సెట్ గా నిలిచింది. హిందీలో `దుర్గామ‌తి` (2020) పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది. 2018 జన‌వ‌రి 26న రిప‌బ్లిక్ డే స్పెష‌ల్ గా రిలీజై వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించిన `భాగ‌మ‌తి`.. నేటితో 4 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com