నాగశౌర్య-చిరంజీవి.. వీరిద్దరి రిలేషన్ ఏంటీ..?
on Jan 31, 2018

అసలు చలో ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ఎందుకెళ్లాడు.. గత కొద్దిరోజులుగా ఫిలింనగర్‌లో ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకునేది దీని గురించే. ఊహలు గుసగుసలాడే, లక్ష్మీ రావే మా ఇంటికి, కళ్యాణ వైభోగమే, జ్యోఅచ్యుతానంద వంటి సినిమాలతో.. యూత్‌లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ కుర్రాడు నటించిన చలో సినిమాపై పాటలు, టీజర్ బాగున్నాయన్న టాక్ తప్ప పెద్దగా అంచనాలు లేవు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడైతే చలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడో అప్పటి నుంచి సినిమాకు భారీ హైప్ వచ్చింది.
ఈ సంగతి పక్కనబెడితే.. నాగశౌర్య ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక చిన్న హీరో.. ఇతని కంటే మంచి రేంజ్ ఉన్న హీరోలు ఎంతోమంది చిరుని తమ సినిమా ఫంక్షన్లకు ఆహ్వానించి ఉంటారు. మెగా హీరోలు లేదా బాగా క్లోజ్‌గా ఉండే హీరోల మూవీ ఈవెంట్లకు మాత్రమే హాజరయ్యే చిరు.. ఉన్నట్లుండి, నాగశౌర్య పిలవగానే కాదనకుండా రావడమేంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన చిరు తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఒక సంఘటనను ఉదాహరణగా చెప్పి.. అలాంటి పరిస్థితి అప్‌కమింగ్ హీరోస్‌కు రాకూడదనే తాను వచ్చానని తెలిపారు. ఈ ఎక్స్‌ప్లనేషన్‌ని నమ్మని సినీజనాలు నిజంగా అసలు రీజన్ అదేనా..? లేక మరేదైనా ఉందా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



