తొలిప్రేమ వాయిదా పడింది.. మెగా ఫ్యాన్స్ హ్యాపీ..?
on Jan 31, 2018
ఫిదా లాంటి కూల్ హిట్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మూవీ తొలిప్రేమ. ఔట్ అండ్ ఔట్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, పాటలు అన్ని తొలిప్రేమపై అంచనాలు పెంచాయి. అన్నింటికి మించి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ను మాస్ ఆడియన్స్‌కు దగ్గర చేసిన అలనాటి తొలిప్రేమ టైటిల్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన తొలిప్రేమలో వరుణ్ తేజ్ సరసన రాశిఖన్నా నటించింది. సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ.. మెగాభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్‌తో ఎదురుచూస్తోన్న వేళ వారి ఆశలపై నీళ్లు చల్లింది చిత్రయూనిట్.
షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9న రావల్సిన తొలిప్రేమ ఆ తర్వాతి రోజుకు వాయిదా పడింది. దీనికి కారణాలు లేకపోలేదు. వివి. వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న ఇంటిలిజెంట్ను తొలిప్రేమకు పోటీగా ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా ఫైట్ తప్పదని అభిమానులు భావించారు.. ఒకేసారి ఇద్దరు హీరోలు రంగంలోకి దిగితే అది మంచిది కాదని.. మెగా పెద్దలు ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో.. వరుణ్ వెనక్కి తగ్గి బావకు దారి వదిలినట్లు ఫిలింనగర్ టాక్. తొలిప్రేమ పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న దిల్‌రాజు కూడా.. అల్లు అరవింద్ విజ్ఞప్తి మేరకు రిలీజ్ డేట్‌ను 10కి మార్చినట్లు సమాచారం. అటు తొలిప్రేమ ఒక రోజు వాయిదా పడటం పట్ల మెగాభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంటిలిజెంట్‌తో పాటు మోహన్ బాబు నటించిన గాయత్రీ, నిఖిల్ కిర్రాక్ పార్టీ కూడా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.