ఉయ్యాలవాడలో ఎన్ని వింతలో..!
on Jun 30, 2017

’బాహుబలి‘ పుణ్యమా అని తెలుగు సినిమా మార్కెట్ ఏకంగా బాలీవుడ్ స్థాయికి చేరుకుంది. దీంతో రాబోతున్న సినిమాల విషయంలో కూడా అదే స్థాయిలో ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక మెగాస్టార్ సినిమా అంటే ప్రత్యేకించి చెప్పేదేముంది!
ప్రస్తుతం ఆయన 151వ చిత్రం ’ఉయ్యాలవాడ నరసింహాడ్డి‘ ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉంది. ’బాహుబలి‘ స్థాయికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెరిగిన తెలుగు సినిమా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని నటీనటుల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటోంది మెగా టీమ్.
కథ రిత్యా ఇందులో ఉయ్యాలవాడ గురువు పాత్ర చాలా కీలకం. అందుకే ఆ పాత్రకు అమితాబ్ ని తీసుకోనున్నట్లు తెలిసింది. ఐశ్వర్యారాయ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఊహకందని చాలా విషయాలతో ’ఉయ్యాలవాడ నరసింహారెడ్డి‘ తెరకెక్కుతున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ’గౌతమీపుత్ర శాతకర్ణి‘కి అద్భుతమైన సంభాషణలు అందించిన సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాసే పనిలో ఉన్నారు.
1847లో భారత స్వతంత్ర్య పోరాటానికి నాందీ వాక్యం పలికిన స్వాతంత్ర్య సమర యోధుడు ’ఉయ్యాలవాడ నరసింహారెడ్డి‘గా మెగాస్టార్ నట విశ్వరూపం చూపిస్తారనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని కూడా ’బాహుబలి‘లా దేశంలోని ముఖ్య భాషలన్నింటిలో రూపొందించనున్నారు. మరి ఈ సినిమాతో మెగాస్టార్ ఎన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



