వినిపిస్తున్న పేర్లు విజయాన్ని ఇస్తాయా ..!
on May 17, 2017

వందవ సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి 'ఘన విజయంతో వరస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలకృష్ణ తన 101 వ చిత్రం పూరి జగన్నాథ్ తో..102 వ చిత్రం కె .ఎస్ రవికుమార్ తో చేస్తున్నారు.అయితే అందరి దృష్టి ఈ రెండు చిత్రాల టైటిల్ల పైనే ఉంది.ఏ పేరుతో చిత్రాలు రానున్నాయో అనేది ఆసక్తిగా మారింది.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం శరవేగం గా చిత్రీకరణను జరుపుకుంటుంది.ఈ చిత్రం ఒక మాఫియా నేపథ్యం లో వస్తున్నందున 'గ్యాంగ్ స్టర్'అనే పేరు పరిశీలనలో ఉందట.ఆ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో కోడై కూస్తుంది.
ఈ పేరు ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో అనే సందేహం వినిపిస్తున్నది. మరి తన నూటరెండవ చిత్ర టైటిల్ మాత్రం గతం లో తనకు విజయాన్ని ఇచ్చిన పదంతో రానున్నట్లు సమాచారం. చిత్ర బృందం 'రెడ్డి గారు' అనే పేరును సూచించినట్లు తెలుస్తుంది.అయితే బాలకృష్ణ గతంలో చేసిన 'రెడ్డి 'పదం తో వచ్చిన చిత్రాలు కాలం గడిచి అవి వినబడకుండా పోయాయి.మరి ఈ రెండు చిత్రాల టైటిల్లు ఎప్పుడు ఖరారు చేస్తారో ..ఆ పేర్లు ఎంతటి విజయాన్ని అందిస్తాయో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



