మెగా ప్రిన్స్‌ను డైరెక్ట్ చేయనున్న శేఖర్ కమ్ముల..?
on May 15, 2016

క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల. మంచి కాఫీ లాంటి చిత్రాలను అందివ్వడంలో శేఖర్ ఎక్స్‌పర్ట్ కావడంతో ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పీక్స్‌కెళ్లిపోతుంది. చివరిగా శేఖర్ డైరెక్ట్ చేసిన అనామిక అంచనాలను అందుకోలేకపోవడంతో బాగా డిస్సప్పాయింట్ అయ్యారు. గత కొంతకాలంగా ఎక్కడ కనిపించడం లేదు. గతేడాదంతా ఎక్కడా కనిపించని శేఖర్ ఆ సమయంలో తన బుర్రకు బాగా పదునుపెట్టాడట. మెగా హీరో వరుణ్ తేజ్‌ను దృష్టిలో పెట్టుకుని స్టోరీ రెడీ చేశాడు. దానిని వరుణ్‌కు వినిపించడం..దానికి అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయని ఫిలింనగర్‌లో గుసగసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో పుర్వవైభవాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. సో మనోడికి కాలం కలిసోస్తుందా..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



