Home

»

Latest News

హేమామాలినిపై కేసు..

May 15, 2016 4:31PM

బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి హేమామాలినిపై కేసు నమోదైంది. మధుర ఎంపీ అయిన హేమ తన నియోజకవర్గంలోని బాన్సివట్‌ పర్యటనకు వెళ్లారు. దీనిలో భాగంగా హేమామాలిని తనను అవమానకర రీతిలో దూషించారని గ్రామ ప్రధాన్ (సర్పంచ్) భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం అతను విలేకరులతో మాట్లాడుతూ చెట్లు ఎవరు తొలగించారని ఆమె తమను ప్రశ్నించారన్నారు. ఆమె తమ మాట వినకుండా తన భార్యను ఎవరు ప్రధాన్ చేశారని నిలదీశారని..అంతేకాక, తన భార్య ఫ్యూన్‌గా కూడా పనికి రాదని తిట్టారని చెప్పారు. ఆ మాటలు తమ మనసును గాయపరిచాయని, ఆమె తీరు ఏ మాత్రం బాగోలేదన్నారు. తమ సర్పంచ్‌ను అవమానించినందుకు నిరసనగా పలువురు గ్రామస్తులు హేమామాలిని దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ సందర్భంగా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామ సర్పంచ్ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com