సంక్రాంతి బరిలో చిరు.. 'ఆదిపురుష్' వర్సెస్ 'మెగా 154'
on Jun 24, 2022

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది 'గాడ్ ఫాదర్' సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్న మెగాస్టార్.. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో సినిమాతో సందడి చేయబోతున్నాడు. ఈ మేరకు తాజాగా 'మెగా 154' విడుదల గురించి అప్డేట్ వచ్చింది.
కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా కీలక అప్డేట్స్ వచ్చాయి. ఈ మూవీని 2023 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే త్వరలో టైటిల్ ని అధికారికంగా ప్రకటించడమే కాకుండా.. టీజర్ అప్డేట్ ఇస్తామని మేకర్స్ తెలిపారు.

'మెగా 154' ఎంట్రీతో ఈసారి సంక్రాంతి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే సంక్రాంతి పోరులో ప్రభాస్ 'అది పురుష్' ఉంది. ఈ మూవీ జనవరి 12, 2023 న విడుదల కానుంది. అలాగే విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న 'వారసుడు' కూడా సంక్రాంతికే రానున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు 'మెగా 154' కూడా సంక్రాంతి బరిలోకి దిగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



