సైలెంట్ గా మెగా మల్టీస్టారర్ ప్రారంభం!
on Jun 24, 2022

తమిళ్ మూవీ 'వినోదయ సీతం' తెలుగులో రీమేక్ కాబోతుందని, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించనున్నారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఈ మెగా మల్టీస్టారర్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందని తెలుస్తోంది.
నటుడిగా, దర్శకుడిగా ఎన్నో విజయాలను అందుకున్న సముద్రఖని గతేడాది 'వినోదయ సీతం' అనే తమిళ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా మెప్పించారు. ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతుందని, సముద్రఖనే డైరెక్ట్ చేస్తారని వార్తలొచ్చాయి. తమిళ్ లో సముద్రఖని, తంబి రామయ్య పోషించిన పాత్రలలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తారని ప్రచారం జరిగింది. సముద్రఖని సైతం తాను పవన్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా లాంచ్ అయినట్లు న్యూస్ వినిపిస్తోంది.
శుక్రవారం నాడు హైదరాబాద్ లో 'వినోదయ సీతం' తెలుగు రీమేక్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జులై రెండో వారంలో మొదలు కానుందని సమాచారం. అలాగే ఈ రీమేక్ కి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ అందిస్తున్నట్లు టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



