ద్రౌపదీ ముర్ముపై కామెంట్స్ ని వెనక్కి తీసుకున్న ఆర్జీవీ
on Jun 24, 2022

ఆర్జీవీ నిన్న చేసిన సంచలన ట్వీట్ పై ఈరోజు కొంచెం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ బలపరుస్తున్న ద్రౌపదీ ముర్ముని ఆయన టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు? అంటూ తన ట్విట్టర్ ఖాతాలో కాంట్రవర్సీ కామెంట్ ని పోస్ట్ చేశారు. ఇక నెటిజన్స్ ఆయన కామెంట్స్ పై ఫైర్ అయ్యేసరికి ఈ రోజు ఈ కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా మరో కామెంట్ ని పోస్ట్ చేశారు.
"ఇది కేవలం గంభీరంగా చెప్పిందే కానీ వ్యంగ్యంగా, వేరే విధంగా ఉద్దేశించి అనలేదు. మహాభారతంలోని ద్రౌపది పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. కానీ ద్రౌపది అనే పేరు చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి ఆ పేరు వినగానే నాకు మహాభారతంలో పాత్రలు గుర్తుకు వచ్చాయి.. ఆ విధంగా నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసాను తప్ప ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కాదు" అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు ఆర్జీవీ.
కాగా కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితాల్లోని కొన్ని ఘట్టాల ఆధారంగా ఆయన దర్శకత్వం వహించిన 'కొండా' సినిమా గురువారం విడుదలైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



