మేక పిల్లని ఎత్తుకొని వస్తున్న పులి.. రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ అదిరింది
on Dec 12, 2022

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న 'వాల్తేరు వీరయ్య'లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రవితేజ నటించిన 'పవర్'తో దర్శకుడిగా పరిచయమైన బాబీ(కె.ఎస్.రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో.. ఇందులో రవితేజను ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా రవితేజ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది.
'వాల్తేరు వీరయ్య'లో రవితేజ.. ఏసీపీ విక్రమ్ సాగర్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనువిందు చేయనున్నాడు. తాజాగా విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ టీజర్ ఆకట్టుకుంటోంది. "ఫస్ట్ టైం ఒక మేక పిల్లని ఎత్తుకొని పులి వస్తా ఉన్నాది" అనే వాయిస్ ఓవర్ తో రవితేజ ఇంట్రడక్షన్ అదిరింది. భుజంపై మేకపిల్ల, ఒక చేత్తో గన్ పట్టుకొని "ఏమిరా వారి పిసాపిసా చేస్తున్నావ్.. నీకింకా సమజ్ కాలే.. నేను ఎవని అయ్యకి విననని" అంటూ రవితేజ తనదైన శైలిలో డైలాగ్ తో అదరగొట్టాడు. రవితేజ బాడీ ల్యాంగ్వేజ్, అదిరిపోయే యాక్షన్ షాట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఫస్ట్ లుక్ టీజర్ మెప్పిస్తోంది. చూస్తుంటే ఈ మూవీలో రవితేజ పాత్ర ఫ్యాన్స్ కి ట్రీట్ లా ఉండబోతుందని అర్థమవుతోంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2023, జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



