ఆస్కార్ బరిలో కీరవాణి.. సంచలనం సృష్టిస్తారా!
on Dec 12, 2022

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' సినిమా పలు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సంగీతం విభాగంలో నామినేషన్ దక్కించుకోవడమే కాదు.. ఎం.ఎం.కీరవాణి అవార్డు గెలుచుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.
'ఆర్ఆర్ఆర్' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కీరవాణి హాలీవుడ్ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంటున్నారు. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో తాజాగా రెండు ప్రతిష్టాత్మక క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను కీరవాణి గెలుచుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి గాను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో 'బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్', 'లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్' కీరవాణిని విజేతగా ప్రకటించాయి. రెండు టాప్ క్రిటిక్స్ అసోసియేషన్స్ కీరవాణిని విన్నర్ గా ప్రకటించడం చూస్తుంటే.. ఆయన ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కీరవాణి ఆస్కార్ బరిలో నిలిచి సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.

ఇక 'లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ విభాగంలో రాజమౌళి రన్నరప్ గా నిలిచారు. రాజమౌళి కూడా బెస్ట్ డైరెక్టర్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంటారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



