ఒకే ఏడాది రెండు.. యూఎస్ లో 1 మిలియన్ క్లబ్ లో 'హిట్-2'
on Dec 12, 2022

ఈ ఏడాది ఇప్పటికే 'మేజర్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న అడివి శేష్.. 'హిట్-2'తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్లకు పైగా షేర్ తో సత్తా చాటిన హిట్-2.. తాజాగా యూఎస్ లో 1 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకోవడం విశేషం.
శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ఈ మూవీ పది రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా షేర్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లో ఇప్పటికీ మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా.. తాజాగా యూఎస్ లో 1 మిలియన్ మార్క్ ని అందుకుంది. ఈ ఏడాది అడివి శేష్ నటించిన 'మేజర్' కూడా యూఎస్ లో 1 మిలియన్ క్లబ్ లో చేరడం విశేషం.
నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్, రావు రమేష్, సుహాస్ తదితరులు నటించారు. జాన్ స్టీవర్ట్ ఏడూరి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



