మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన 'మసూద'
on Nov 21, 2022

'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మూడో చిత్రం 'మసూద'. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయడం విశేషం. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 18న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ తో రోజురోజుకి కలెక్షన్లు పెంచుకుంటున్న 'మసూద' మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.75 లక్షల గ్రాస్, రెండో రోజు రూ.92 లక్షల గ్రాస్ రాబట్టిన 'మసూద'.. మూడో రోజు ఏకంగా రూ.1.48 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో రూ.3.15 కోట్ల గ్రాస్(రూ.1.70 కోట్ల షేర్) కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా రూ.3.35 కోట్ల గ్రాస్(రూ.1.80 కోట్ల షేర్) రాబట్టినట్టు సమాచారం.
రూ.1.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేరిన 'మసూద' రూ.1.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మూడు రోజుల్లోనే రూ.1.80 కోట్ల షేర్ రాబట్టి ఇప్పటికే ప్రాఫిట్స్ లోకి ఎంటరైంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం బయ్యర్లకు కోటికి పైగా లాభాలు తెచ్చిపెట్టే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



