మెగాస్టార్ కి ప్రతిష్ఠాత్మక పురస్కారం
on Nov 21, 2022

మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డు వరించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
గోవాలో 53వ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'(IFFI) వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 2022 కి గాను చిరంజీవికి 'ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డుని ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 150 కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని ప్రశంసించారు. 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించడం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వానికి, IFFI కి, అనురాగ్ ఠాకూర్ కి ధన్యవాదాలు తెలిపారు.
చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం లభించడం పట్ల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోదరుడు పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



