దిల్ రాజు సినిమాకు ఓవర్సీస్ బిజినెస్ బీభత్సం!
on Nov 21, 2022

విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తోన్న తమిళ చిత్రం 'వారిసు'. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. తెలుగులో 'వారసుడు' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రానున్న ఈ సినిమాకు తెలుగునాట ఎక్కువ థియేటర్లు ఇవ్వొద్దని నిర్మాతల మండలి ఇటీవల ఓ నోటీస్ ద్వారా వార్నింగ్ ఇచ్చింది. అలా ఈ సినిమా వార్తల్లో నిలిచింది.
ఆ సంగతి అలా ఉంచితే, ఈ మూవీ ఓవర్సీస్ బిజినెస్ అదుర్స్ అనే రేంజిలో ఉంది. 'వారిరిసు' చిత్రం ఓవర్సీస్ హక్కులు రూ. 35 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. పొంగల్‌కు ఈ మూవీతో తలపడుతున్న అజిత్ 'తునీవు' చిత్రం ఓవర్సీస్‌లో బిజినెస్ పరంగా దాదాపు రూ. 14 కోట్లు రాబట్టినట్లు సమాచారం. దీన్నిబట్టి ఓవర్సీస్‌లో విజయ్ మూవీస్‌కు ఉన్న డిమాండ్, ఆయన మార్కెట్ విలువ ఏంటనేది అర్థమవుతోంది.
2023 సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న తెలుగు సినిమాలు.. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' కంటే కూడా 'వారిసు' చాలా ఎక్కువ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో స్క్రీన్‌లను పొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడానికి పాజిటివ్ మౌత్ టాక్ అవసరం.
'వారిసు' చిత్రంలో విజయ్ సరసన నాయికగా రష్మిక మందన్న నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రభు, శ్యామ్, మీనా, ఖుష్బు, స్నేహ, యోగి బాబు, గణేష్ వెంకట్రామన్ వంటి పేరుపొందిన యాక్టర్స్ నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



