'జాతి రత్నాలు' డైరెక్టర్ తో శివ కార్తికేయన్ మూవీ షురూ!
on Feb 10, 2022

'పిట్టగోడ' సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమిన కేవీ అనుదీప్ 'జాతి రత్నాలు' సినిమాతో సంచలన విజయాన్ని అందుకొని ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. జాతిరత్నాలు సక్సెస్ తో కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా తమిళ, తెలుగు ద్విభాష చిత్రం దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కించుకున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ తాజాగా లాంఛనంగా ప్రారంభమైంది.
అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ శివ కార్తికేయన్ 20వ సినిమా కావడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గురువారం తమిళనాడులోని కరైకుడిలో ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమంలో హీరో, దర్శక నిర్మాతలతో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న సత్యరాజ్ పాల్గొన్నారు. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, రీతూ వర్మ హీరోయిన్స్ గా నటించనున్నారని తెలుస్తోంది.

గతేడాది 'డాక్టర్'తో సంచలన విజయాన్ని అందుకున్న శివ కార్తికేయన్.. డాన్, అయలాన్, సింగపతై సినిమాలతో పలకరించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఇప్పుడు అనుదీప్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. కార్తికేయన్ హీరోగా నటిస్తున్న డైరెక్ట్ తెలుగు మూవీ ఇదే కావడం విశేషం. లండన్, పాండిచ్చేరి నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా కూడా జాతిరత్నాలు లాగే కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



