బాలయ్య `భలే దొంగ`కి 33 ఏళ్ళు!
on Feb 10, 2022

నటసింహ నందమూరి బాలకృష్ణ - లేడీ సూపర్ స్టార్ విజయశాంతిది హిట్ పెయిర్. వీరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు తెలుగునాట కాసుల వర్షం కురిపించాయి. వాటిలో `భలే దొంగ` ఒకటి. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ సినిమాలో టైటిల్ రోల్ లో భలేగా ఎంటర్టైన్ చేశారు బాలయ్య. శారద ఓ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రావు గోపాల రావు, మోహన్ బాబు, చరణ్ రాజ్, రంగనాథ్, అన్నపూర్ణ, చలపతి రావు, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, హేమ, పి.ఎల్. నారాయణ, సాక్షి రంగరావు, హేమసుందర్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
అగ్ర సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరరచన చేసిన ఈ చిత్రానికి దిగ్గజ గీతరచయిత వేటూరి సుందరరామ్మూర్తి పదరచన చేశారు. ``ఏం ముద్దు.. యమా ముద్దు ``, ``పెదవిని చూడు``, `కన్నె పిల్ల కాశ్మీరం``, ``మల్లెల్లో మ్యాచ్ మ్యాచ్.. కౌగిట్లో క్యాచ్ క్యాచ్``,``అడిగింది ఇస్తే ఆడపిల్ల అలుసు``.. ఇలా ఎస్పీ బాలసుబ్రమణ్యం, జానకి గానమాధుర్యంలో వచ్చిన పాటలన్నీ ఆకట్టుకున్నాయి. జి. సత్యమూర్తి కథను సమకూర్చిన ఈ చిత్రానికి వి.ఎస్.ఆర్. స్వామి ఛాయాగ్రహణం అందించారు. దేవీ ఫిల్మ్స్ పతాకంపై కె. దేవీ వర ప్రసాద్ నిర్మించిన `భలేదొంగ`.. 1989 ఫిబ్రవరి 10న విడుదలై మంచి విజయం సాధించింది. నేటితో ఈ మాస్ ఎంటర్టైనర్ 33 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



