చివరికి మణిరత్నం కూడా ఇలా చేస్తే ఎలా?
on Feb 10, 2017
ఈ రోజుల్లో పబ్లిసిటీ సినిమాకి కీలకంగా మారింది. చిన్నా పెద్దా అని లేదు. ప్రతీ సినిమా పబ్లిసిటీతో ఆదరగొట్టాల్సిందే. ఎంత గొప్ప సినిమా తీసినా సరైనా పబ్లిసిటీ లేకపొతే మరుగున పడిపోయి పరిస్థితి. సినిమాని తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసుకోవడం మరో కీలక బాగంగా మారింది. ఈ ప్రమోషన్ కూడా మాములుగా వుంటే ఆనదు. కాస్త వినూత్నంగా ప్లాన్ చేయాలి. అప్పుడే జనాల కంటపడుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్నీ సినిమాలకీ కీలకంగా మారిపోయిందిప్పుడు పబ్లిసిటీ. ఎప్పుడూ బయటికిరాని కొందరు ప్రముఖులు సైతం ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం ప్రమోషన్స్ లో బాగం అవుతున్నారు. ఇప్పుడీ లిస్టు లో వెటరన్ డైరెక్టర్ మణిరత్నం కూడా చేరారు.
మణిరత్నం.. పోస్టర్ పై ఈ పేరు కనపడితే చాలు టికెట్లు తెగిపోతాయి. సిల్వర్ స్క్రీన్ సైంటిస్ట్ మణిరత్నం. వెండితెరపై ఓ పెయింటింగ్ లా ఉంటుంది ఆయన సినిమా. అయితే ఆమధ్య తన ఫాంని కోల్పోయినట్లు కనిపించిన మణిరత్నం... ''ఓకే బంగారం''తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశారు. ఇప్పుడు కార్తీతో 'కాట్రు వెలియిదాయ్'అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ''చెలియా'' అనే టైటిల్ తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది.
ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు వచ్చిన ఈ చిత్రం నుండి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఓ విశేషం వుంది. ఇందులో మణిరత్నం కనిపించారు. ఇది విశేషమే. సినిమా తీయడం తప్పితే పోస్టర్స్ పై కనిపించడం మణిరత్నంకు అలవాటు లేదు. మీడియాకి కూడా ఆయన దూరం. సినిమా రిలీజ్ ముందు మహా అయితే ఆడియో ఈవెంట్, పేపర్ ఇంటర్వ్యూల్లో కనిపిస్తారంతే. అలాంటి మణిరత్నం ఇప్పుడు తన ఫోటో తో కూడిన వర్కింగ్ స్టిల్ ని విడుదల చేశారంటే ప్రస్తుతం పబ్లిసిటీ ట్రెండ్ అనుగుణంగా వెళ్ళాల్సిందే అనే నిర్ణయానికి వచ్చినట్లు భావించాలి. ఏదేమైనా మణిరత్నం ఇలా పోస్టర్స్ పై కనిపించడం ఆయన అభిమానులను అలరించే విషయమే.