ప్రభాస్ లాగా శివలింగాన్ని ఎత్తిన ముఖ్యమంత్రి
on Feb 10, 2017

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సామ, ధాన, భేద, దండోపాయాలు ఉపయోగించి జనాన్ని మాయ చేస్తాయి. ఏం చేసైనా సరే గెలవడమే వారి మెయిన్ టార్గెట్. ఇందుకోసం సినిమా పాటలని వాడుకుంటారు...అవసరమైతే సినిమా వాళ్లతో ప్రచారం చేయిస్తారు. ఇందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ప్రాంతీయ హీరోని వదలరు. తాజాగా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పి తెలుగు వారు గర్వపడేలా చేసిన బాహుబలిని కూడా ఎన్నికల ప్రచారంలో భాగం చేసేశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న ఎన్నికలు బీజేపీ-కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.
.jpg)
తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన ప్రచారం కోసం బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకుని తన భుజంపై ఎత్తుకుని వస్తుండగా వచ్చే ఎవ్వరంట..ఎవ్వరంట అనే పాటను వాడేశారు. ఇందులో బాహుబలిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఆ రాష్ట్ర మ్యాప్‌ను ఎత్తుకుంటూ కనిపిస్తారు. ఈ సన్నివేశంలో తనికెళ్ల భరణి గెటప్‌లో ప్రధాని మోడీని చూపించి హరీష్ అలా ఉత్తరాఖండ్ మ్యాప్‌ను భుజంపై ఎత్తుకుని వెళుతుంటే ప్రధాని ఆశ్చర్యపోతున్నట్లు కనిపిస్తారు..ప్రస్తుతం ఈ వీడియో ఆ రాష్ట్ర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



