విక్రమ్ నుదుటిన తిలకం ఉందని మణిరత్నంకు కోర్టు నోటీసు
on Jul 19, 2022

మణిరత్నం రూపొందిస్తోన్న 'పొన్నియిన్ సెల్వన్' మూవీ కోసం సినీ ప్రియులు అత్యంత కుతూహలంతో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫిల్మ్ టీజర్ వైరల్ అవుతుండగా, కొత్త సమస్య వచ్చి పడింది. చోళులను తప్పుగా చూపిస్తున్నారంటూ మణిరత్నం, చియాన్ విక్రమ్‌కు వ్యతిరేకంగా కోర్టు నోటీసు జారీ అయ్యింది. కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా ఈ మూవీని మణిరత్నం తీస్తున్నారు. చోళ సామ్రాజ్యం ఎదిగిన తీరును ఈ సినిమాలో చూపిస్తున్నారు.
రెండు భాగాలుగా తయారవుతున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానున్నది. టీజర్ రిలీజైన కొద్ది రోజుల తర్వాత సెల్వమ్ అనే లాయర్ మణిరత్నం, విక్రమ్‌కు కోర్టు నోటీసు పంపారు. చరిత్ర ప్రకారం ఆదిత్య కరికాలన్‌కు నుదిటి మీద తిలకం ఉండదని తన పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. కానీ ఆ పాత్ర పోషించిన విక్రమ్ నుదుటిన తిలకం ఉందని పోస్టర్, టీజర్ తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. దీన్ని బట్టి చోళులను ఈ సినిమాలో తప్పుగా చూపిస్తున్నారని సెల్వం అభిప్రాయపడ్డారు. చారిత్రక వాస్తవాలను దర్శక నిర్మాతలు మరుగుపర్చారో, లేదో తెలియాలంటే విడుదలకు ముందు ఆ ఫిల్మ్‌ను ప్రత్యేకంగా చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ నోటీసుకు ఇంతదాకా మణిరత్నం కానీ, విక్రమ్ కానీ స్పందించలేదు.
'పొన్నియన్ సెల్వన్' మూవీలో ఐశ్వర్యారాయ్, చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శోభిత ధూళిపాళ, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి, లాల్, కిశోర్ కీలక పాత్రలు చేశారు. ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ మూవీకి ఎ. శ్రీకర్‌ప్రసాద్ ఎడిటర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



