'థాంక్యూ'ని మహేష్ ఫ్యాన్స్ హిట్ చేస్తారా?
on Jul 19, 2022

టాలీవుడ్ లో భారీ సంఖ్యలో అభిమానులున్న కుటుంబాలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. అక్కినేని యువ హీరో నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ 'థాంక్యూ' జులై 22న థియేటర్స్ లోకి రానుంది. అయితే ఈ సినిమాకి అక్కినేని అభిమానులతో పాటు.. ఘట్టమనేని అభిమానుల మద్దతు కూడా భారీగా లభించే అవకాశముందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

'థాంక్యూ'లో మూడు షేడ్స్ ఉన్న పాత్రలో చైతన్య అలరించనున్నాడు. కాలేజ్ ఎపిసోడ్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా కనిపించనున్నాడు. అప్పుడప్పుడూ సినిమాల్లో ఒక హీరో మరో హీరోకి అభిమానిగా కనిపించడం చూస్తుంటాం. కానీ ఇందులో ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా చైతన్య కనిపించనుండటం విశేషం. బ్యానర్లు, కటౌట్లుతో మహేష్ ఫ్యాన్ గా 'థాంక్యూ'లో చైతన్య చేసే సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుందట. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో గతంలోనే షూటింగ్ టైంలో లీక్ అయ్యాయి. మరోవైపు రీసెంట్ చైతన్య కూడా ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుందని చెప్పాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ కి 'థాంక్యూ' సినిమాపై ఆసక్తి ఏర్పడింది. మహేష్ అభిమానులు ఈ సినిమాకి క్యూ కడితే అంచనాలకు మించి భారీ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.

నాని హీరోగా నటించిన మొదటి సినిమా 'అష్టాచమ్మా'(2008) లో హీరోయిన్ స్వాతి కూడా మహేష్ కి బిగ్ ఫ్యాన్ గా అలరించింది. 'మహేష్' అంటూ ఈ సినిమా అంతా ఆయన పేరు చుట్టూనే తిరుగుతుంది. అప్పట్లో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ సెంటిమెంట్ ఇప్పుడు చైతన్య 'థాంక్యూ'కి కూడా కలిసొస్తుందేమో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



